తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గాల గురించి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ క్లారీటీచ్చారు. ఆయన నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ” కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గాలు దేశంలో ఏ పార్టీలో కూడా ఉండవు. అవినీతి అక్రమాలతో పాటు ఎక్కువ వర్గాలుండే పార్టీ ఏదైన అంటే అది కాంగ్రెస్ పార్టీ అని “ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”టీఆర్ఎస్ లో ఒకటే వర్గం.. వేరే వర్గానికి చోటులేదు. జడ్పీటీసీ,ఎంపీటీసీ లు సర్పంచుల విధుల్లో జోక్యం చేసుకోవద్దని వాళ్లకు హితవు పలికారు. అందరికీ చక్కని తోడ్పాటును అందించాలని కోరారు.
