యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఆగష్టు 30న విడుదలైన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ తీసాడు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. ఈ చిత్రం స్టొరీ పరంగా ఎవరికీ అంతగా నచ్చకపోయినా కలెక్షన్లు పరంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. రెండువారాల్లో వరల్డ్ వైడ్ 424కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. సినిమా రిలీజ్ అయిన మొదటిరోజే నెగటివ్ టాక్ రావడంతో ఇక అందరు నిర్మాతల పని అయిపోయినట్టే అనుకున్నారు. కాని సినిమా ఎలా ఉన్నప్పటికే కలెక్షన్లు విషయంలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. అయితే ఇక అసలు విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో స్టొరీ పరంగా ఎవరికీ అంతగా నచ్చలేదు. కాని హిందీ విషయానికి వస్తే మాత్రం ఈ చిత్రం దుమ్మలేపిందనే చెప్పాలి. అంతేకాకుండా కలెక్షన్లు విషయానికి వస్తే 153కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా చెప్పాలంటే నిర్మాతలను హిందీ ప్రేక్షకులే బ్రతికించారని చెప్పాలి.
