Home / SLIDER / హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా సైదిరెడ్డి

హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా సైదిరెడ్డి

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ,ప్రస్తుత నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయడంతో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి తెల్సిందే.

హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు ముహూర్తం ఖరారు చేసింది ఎన్నికల కమిషన్. అందులో భాగంగా వచ్చే నెల అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల ఇరవై మూడున దీనికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.

ఎన్నికల్లో బరిలోకి దిగేవారు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు సెప్టెంబర్ ముప్పై. నామినేషన్లు ఉపసంహారణకు అఖరి గడవు అక్టోబర్ 3. పోలింగ్ అక్టోబర్ 21. ఎన్నికల ఫలితాలు వెలువడేది అక్టోబర్ 24.

అయితే టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగే అభ్యర్థిని ఆ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.