తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఒక అద్భుతమైన, భారతదేశం గర్వించదగ్గ నటుడు, డాన్సర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే జక్కన్న బాహుబలి గురించి కూడా ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ ఖ్యాతిని నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి. అయితే రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ ర్ ఈ సినిమాకు సంబంధించిన ఓ వర్కింగ్ స్టిల్ ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.. కారణం ఏమిటి అంటే దాదాపుగా 18 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ తో రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమా తీశారు.అందులో కొన్ని సన్నివేశాలు రామోజీ ఫిలిం సిటీలో తీయడం జరిగింది. అయితే మళ్లీ 18 సంవత్సరాల తర్వాత మల్లా ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాకు సంబంధించి గతంలో తీసిన ప్రాంతంలోనే అదే స్థితిలో షూటింగ్ చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
