పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తన అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అనంతరం తానే సొంతం గా 2014 మార్చ్ 14న జనసేన పార్టీ స్థాపించి మరోసారి రాజకీయాల్లో అడుగు పెట్టాడు. 2014 ఎన్నికల్లో పవన్ బీజీపీ,టీడీపీ కి మద్దతు ఇచ్చాడు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు పవన్.. అదేమిటంటే పవన్ సినిమాలకు దూరంగా ఉంటానని స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ ఘోర పరాజయం చవిచూసాడు. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో గెలవలేకపోయాడు. చివరికి తన పార్టీ తరపున ఒకేఒక సీట్ నెగ్గింది. అయితే ఇప్పుడు పార్టీ పరంగా పవన్ కి అంతగా పని లేకపోవడంతో మల్లా సినిమాలపై ఆశక్తి చూపుతున్నాడట.. ఈమేరకు ఇప్పటికే వార్తలు గట్టిగానే వస్తున్నాయి. దీనికి తోడు తమిళ డైరెక్టర్ హరి పవన్ ని కలిసాడు. కలిసి తనకి కధ చెప్పాడని, అది పవన్ కి కూడా నచ్చిందని త్వరలో దీనిపై అప్డేట్ కూడా వస్తుందని సమాచారం. అంతేకాకుండా డైరెక్టర్ క్ర్రిష్ కూడా పవన్ కు తగ్గ కధ రాస్తున్నాడట. వీరిద్దరూ అయితే ఫుల్ క్లారిటీతో ఉన్నప్పటికీ మరి పవన్ ఏమంటాడు అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదట.