స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ హీరోల్లో ఒక్కడు. తన నటనతో అందరిని తన పక్కకు తిప్పుకున్నాడు. అయితే బన్నీ కి చిన్నతనం నుండి డాన్స్ అంటే బాగా ఇష్టం. ప్రస్తుత హీరోల్లో బెస్ట్ డాన్సర్ ఎవరూ అంటే అల్లు అర్జున్ అనే అంటారు. బన్నీ 2011, మార్చ్ 6న హైదరాబాద్ కు చెందిన స్నేహా రెడ్డి ని పెళ్లి చేసుకున్నాడు.వీరికి అయాన్ అనే కుమారుడు,అర్హ అనే కుమార్తె ఉన్నారు. ఇక అసలు విషయానికి వస్తే సెప్టెంబర్ 29న స్నేహా రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బన్నీ తనకి జీవితాంతం మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడట. అదేమిటంటే బన్నీ స్నేహా కి ఒక హగ్ ఇచ్చాడట. ఆ ఫోటోను అల్లు అర్జున్ నే స్వయంగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.