తెలంగాణ రాష్ట్రంలో రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సాయి బాబా నగర్ కు చెందిన భారతిశ్ అనే యువకుడు మొన్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జన సమయంలో ప్రమాదవశాత్తు కరెంటు షాక్ కు గురయ్యాడు.
దింతో నిరుపేద కుటుంబానికి చెందిన భారతిశ్ కు ఆర్థికంగా సాయం చేసేవారంటూ ఎవరు లేకపో వడంతో, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు బాధితుడికి పెద్దన్నగా నిలిచారు.
ఆర్థికంగా వెనుకబడి, చికిత్స చేయించుకునే స్థోమత కూడా లేని భారతిశ్ కు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి సహాయనిధి (ఎల్ వో సి ) పథకం ద్వారా రూ.2 లక్షలను మంజూరు చేయించి ఈరోజు తన నివాసం వద్ద అందజేశారు. దింతో బాధిత కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారికి, ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే గారు చేసిన సహాయాన్ని ఎన్నిటికి మరిచిపోలేమన్నారు.