సంతకం..ఈ మాటకు ఉన్న వ్యాల్యూ చాలా ఎక్కువ. సాధారణ వ్యక్తుల కంటే ముఖ్యమంత్రులు. నాయకుల సంతకాలతో ఉన్న విలువ చెప్పలేము. ఒక్క సంతకంతో కొన్ని వందల మంది జీవితాలను మార్చవచ్చు. ఒకే ఒక్క సంతకంతో వేల మంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించోచ్చు. అయితే ఆ మొదటి సంతకం విషయంలో వైయస్ రాజశేఖర్రెడ్డి సంతకానికి కు ఉన్న ప్రాధాన్యత ఇచ్చిన విలువ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా వైఎస్ చనిపోయిన తర్వాత పది సంవత్సరాలకు ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి కూడా తన సంతకంతో ప్రజల గుండెల్లో చెరగని సంతకాలు చేస్తున్నారు. పింఛన్ల పెంపు ఉద్యోగాల భర్తీ వంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్, జగన్ సంతకాలు ఒకే విధంగా ఉండడం సంతకాలకు తండ్రీ కొడుకులిద్దరూ ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా 2014లో అధికారం చేపట్టిన అప్పటి ముఖ్యమంత్రి మొదటి ఐదు సంతకాల పేరుతో వాటి విలువను దిగజార్చే విషయం తెలిసిందే.
