సంచలన నిర్ణయాలకు మారుపేరైన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులపై మరో బాంబు పేల్చారు. ఈ విషయాన్ని డిప్యూటీ ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. ముఖ్యంగా భూముల విషయంలో, రికార్డుల విషయంలో టీడీపీ చేస్తున్న తప్పుడు ఆరోపణలను ఆయన ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇప్పటికీ 3.3కోట్ల ఎకరాల భూమి ఉందని ఈ భూమికి సంబంధించి పూర్తి స్థాయిలో సరైన రికార్డులు లేని కారణంగా ప్రక్షాళన చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కబంధహస్తాల్లో రాష్ట్రవ్యాప్తంగా చిక్కుకున్న కొన్ని వేల ఎకరాల భూములపై క్లారిటీ వస్తుందన్నారు. ఇదే గనుక జరిగితే రాజధాని అమరావతిలో నెల్లూరు జిల్లాలో, గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అండ చూసుకుని భూకబ్జాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు బయట పడే అవకాశం ఉంది. ఒకవేళ ఈ భూ రికార్డులు పై ఎంక్వయిరీ జరిగితే తప్పకుండా టీడీపీలో ఇప్పటికీ మిగిలి ఉన్న నాయకులంతా జైలుకెళ్లడం ఖాయం గా కనిపిస్తోంది.
