Home / ANDHRAPRADESH / వైసీపీలో జూపూడి చేరికను తీవ్రంగా ఖండిస్తున్న ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు

వైసీపీలో జూపూడి చేరికను తీవ్రంగా ఖండిస్తున్న ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు

జూపూడి ప్రభాకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. జగన్ రాజకీయ అరంగేట్రం జూపూడి పాత్ర ఎంతో ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న జూపూడి వైఎస్సార్ మరణానంతరం జగన్ వెంట నడిచారు. అనంతరం జగన్ ఎదుర్కొన్న ఎన్నో ఒడిదుడుకులు జూపూడి జగన్ వెంట నడిచి వైసీపీ ఏర్పాట్లు క్రియాశీలక పాత్ర పోషించారు. ఏ పొలిటికల్ డిబేట్ జరిగిన వైసీపీ తరఫున జూపూడి కచ్చితంగా ఉండాల్సిందే.  సత్తితులు తెలివితేటలతో పాటు దళిత జాతి మొత్తం వైసీపీ వెంటే ఉంటుందని జూపూడి అనేకసార్లు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. 2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల మెజారిటీతో వైసీపీ ఓడిపోవడంతో జూపూడి అధికార పార్టీలోకి వెళ్ళిపోయారు. అక్కడే ఎమ్మెల్సీ పదవి తీసుకుని ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో మళ్లీ అధికార గూటికి చేరారు జూపూడి. అయితే జూపూడిని తీవ్రంగా వ్యతిరేకించడానికి బలమైన కారణాలు కూడా లేకపోలేదు.

జూపూడి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీని నిత్యం విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి రాజకీయ అండతో రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన జూపూడి అనంతరం వారి పైన విమర్శలు గుప్పించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని జూపూడి మరోసారి మన పార్టీ లోకి ఎలా వస్తారు అంటూ వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా జూపూడి గతంలో చేసిన వ్యాఖ్యలు సరికావని గుర్తుచేస్తున్నారు. దళిత జాతికి సంబంధించి నమ్మక ద్రోహం చేసిన వారిలో జూపూడి ఉండడంతో దళితులు కూడా వైసీపీ తరఫున వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రస్తుతం వైసీపీ అధినాయకత్వం ఆలోచన మరోలా ఉంది. మన పార్టీ బలపడాలంటే ఎదుటి పార్టీని బలహీన పరచాల్సిన ఎన్నికల వ్యూహం ఒకటి. అయితే మరోకటి కూడా ఉంది అడ్మినిస్ట్రేషన్ పరంగా పార్టీకి సీనియర్ నాయకులు అవసరం. రాజకీయాల్లో పార్టీ మార్పులు సహజంగానే ఇటీవల జరుగుతున్న సిద్ధాంతపరంగా ఉండాలనేది జగన్ నిర్ణయం.

ఈ క్రమంలో జూపూడికి ఎటువంటి పదవి ఆఫర్ ఇవ్వలేదని తెలుస్తోంది. అలాగే జూపూడి మాత్రమే కాదు ఎవరు పార్టీలోకి వచ్చిన జగన్ సాదరంగా ఆహ్వానిస్తారు కానీ ఫిరాయించిన వారికి నమ్మక ద్రోహం చేసిన వారికి మాత్రం ఎటువంటి పదవులు ఇవ్వరు, వారు గనుక పార్టీలోకి వస్తే కచ్చితంగా రావచ్చు పార్టీకి సేవ చేయొచ్చు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ వారికి పదవులు ఇచ్చే ప్రసక్తి లేదు వారిని తెచ్చి కార్యకర్తల నెత్తి మీద పెట్టే పరిస్థితి లేదు. మరోవైపు జగన్ కావాలనుకుంటే ఏ పదవి అయినా ఇచ్చి ఆహ్వానిస్తారు కానీ ఒక్కసారి పార్టీలో నుంచి వెళ్లిన వారికి పదవి ఆఫర్ లు ఇవ్వడం లేదు అనేది వాస్తవం. ఏది ఏమైనా పార్టీ అధ్యక్షుడు ఆలోచించి తీసుకున్న నిర్ణయానికి అడ్మినిస్ట్రేషన్ పరంగా ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ఎటువంటి నాయకులు అవసరం లేదు. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని ఒకవేళ అధిష్టానం కనుక అలాంటి నిర్ణయం తీసుకుంటే దానిని కార్యకర్తలు ఆమోదించాలంటూ సోషల్ మీడియా వేదికగా ఎవరికి వారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat