దసరా అయ్యిపోయింది..దీపావళి కూడా వచ్చేస్తుంది. అయితే సీజన్ లో సినిమాలుఎలాంటి విజయాలు సాధించాయి, దసరా సీజన్ ను ఎలా వాడుకున్నాయి అనే విషయాన్నీ పక్కన పెడితే ప్రస్తుతం టాలీవుడ్ కన్ను మొత్తం క్రిస్మస్ పైనే పడిందట. ముందు పెద్ద పండగ సంక్రాంతి ఉండగా క్రిస్మస్ తో పని ఏమిటీ అని చాలామందికి ఆలోచన వస్తుంది. కాని అసలు విషయం ఇక్కడే ఉంది. పండగ సీజన్ అంటే బడా హీరోలకే అంకితం అని చెప్పాలి. మరి చిన్న హీరోల విషయానికి వస్తే వారికోసమే ఈ క్రిస్మస్. ఇక్కడ ఈ పండుగకు సెలవులు ఎక్కువగా ఇవ్వనప్పటికీ అమెరికాలో ఎక్కువ సెలవులు, మరియు న్యూఇయర్ ఈవెంట్స్ భారీగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దాంతో ఇప్పుడు ఈ సీజన్ కు గాను ఏకంగా ఆరు సినిమాలు పోటీపడుతున్నాయి. వెంకీ మామ, డిస్కో రాజా, ప్రతిరోజూ పండగే, భీష్మ చిత్రం క్రిస్మస్ సందర్భంగా విడుదల కానున్నాయి. అంతేకాకుండా బాలకృష్ణ చిత్రం మరియు అనుష్క ‘నిశబ్ధం’ కూడా వీటితో పోటీపడనున్నాయి.
