టీఆర్ఎస్ అభ్యర్ది శానంపూడి సైదిరెడ్డిని గెలిపించుకోవడం ద్వారా హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అద్బుతంగా అభివృద్ది చేసుకునే అవకాశం ఉంటుందని తూర్పు ఎమ్మెల్యే,నేరేడుచర్ల టౌన్ ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ అన్నారు..నేరేడు చర్ల మున్సిపాలిటీ పరిదిలోని 31వ బూత్ లో ఇంటింటికి తిరుగుతూ శానంపూడి సైదిరెడ్డికి ఓటు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్దించారు..
ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు,కార్యకర్తలు,బూత్ ఇంచార్జ్ లు,మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం,కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమాభివృద్ది కార్యక్రమాలే టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయన్నారు.శానంపూడి సైదిరెడ్డిని గెలిపించుకోవడం ద్వారా నియోజకవర్గాన్ని అద్బుతంగా అభివృద్ది చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.
నేరేడుచర్ల ను మున్సిపాలిటీ గా మార్చి,అభివృద్ది కోసం 10కోట్ల నిదులు ముఖ్యమంత్రి గారు కేటాయించారన్నారు.ప్రజలే కేంద్రంగా టీఆర్ఎస్ పాలన సాగుతుందని,ఈ సారి టీఆర్ఎస్ అభ్యర్దికి అవకాశం కల్పించి నియోజకవర్గ అభివృద్ది చేసుకుందామన్నారు..టీఆర్ఎస్ తోనే అభివృద్ది సాద్యమని,కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్ది శానంపూడి సైదిరెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బహుమానంగా ఇద్దామన్నారు..
Post Views: 311