నెలకోసారి వార్తల్లోకి వచ్చే అల్లు ఫ్యామిలీ ఇప్పుడు ప్రతీరోజు వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటివరకు సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ రాలేదనే వార్త నడిచింది. ఇప్పుడు అల్లు కుటుంబం విడిపోయిందనే వార్త ఎక్కువగా వస్తుంది. అంతే కాకుండా గీత ఆర్ట్స్ బ్యానర్ విడిపోయిందని, అల్లు శిరీష్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని ఇక అతడు సినిమాలు మానేస్తే బాగుంటుందని అందరు అంటున్నారు. ఇప్పటికే తండ్రి అల్లు అరవింద్ ఆస్తిని కొడుకులకు సమానంగా పంచేశారు. అటు అల్లు బాబీ సొంతంగా నిర్మాణ సంస్థ పెట్టుకొని వరుణ్ తేజ్ తో సినిమా తీస్తున్నాడు. ఇక మిగిలిన వారి విషయానికి వస్తే ఎప్పటినుండో అరవింద గీత ఆర్ట్స్ బ్యానర్ ను అల్లు శిరీష్ ని చూసుకోమని చెప్పగా తనకి నటనపై ఇష్టం ఉండడంతో దీనికి దూరంగా ఉంటున్నాడు. ఇక చివరికి మిగిలింది బన్నీ నే ప్రస్తుతం దీని బాగోగుల బన్నీ నే చూసుకుంటున్నాడు. ఈ మేరకు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో వస్తున్న సినిమాలో గీత ఆర్ట్స్ ను భాగస్వామ్యం చేసాడు. ఇకనుండి రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ ల మాదిరిగానే బన్నీ సొంత బ్యానర్ పై సినిమాలు నిర్మించనున్నాడు.
