నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ సీజన్ 3 చివరి దశకు చేరుకుంది. నేటితో 12 వారాలు పూర్తి చేసుకుంది. మరో రెండు వారాల్లో బిగ్‌బాస్ సీజన్ 3 తెలుగుకు ముగింపు పలకనున్నారు. ఈ క్రమంలోనే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్‌బాస్ హౌస్ నుంచి వరుణ్ సందేశ్ భార్య నటి వితిక ఎలిమినేట్ అయ్యారు. తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా ఆమెను హౌస్ నుంచి పంపించివేస్తున్నట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. నామినేషన్‌లో ఉన్నవారిలో శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్ ఇప్పటికే సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయారు.
