తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గుడి కట్టించనున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో తాను ఈ మేరకు చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలోని అవసరాల కోణంలో తాను మంత్రి హరీశ్‌రావుతో సఖ్యతగా ఉంటున్నట్లు తెలిపారు. త్వరలో ఓ సినిమా కూడా తీయబోతున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు.
ఓ మీడియా సంస్థతో మాట్లాడిన జగ్గారెడ్డి తాను అప్పుల్లో ఉన్నట్లు ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను అప్పులు చేసినట్లు చెప్పుకొచ్చారు. త్వరలో తన జీవిత చరిత్రను సినిమాగా తీయబోతున్నట్లు వెల్లడించారు. ఇందులో తన పాత్రను పోషించాలని సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కోరుతానని తెలిపిన జగ్గారెడ్డి…ఆయన కాదంటే..వేరే వారిని వెతుక్కుంటానని తెలిపారు.
ఇక రాజకీయాల గురించి పేర్కొంటూ…తాను కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పే టీఆర్ఎస్లో చేరాలనే ఒత్తిడి వివిధ వర్గాల నుంచి వచ్చినప్పటికీ…తన కూతురు సూచనతో ఆగిపోయినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించే అవకాశం దక్కితే…ఆలోచిస్తానని అన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు గుడి కట్టిస్తాననే హామీకి కట్టుబడి ఉన్నానని పేర్కొంటూ…రైతులందరికీ మేలు జరిగిన రోజున…ఆ నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు.
Post Views: 262