తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఓటింగ్ జరిగింది. ఈ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలయింది.
మొత్తం ఇరవై రెండు రౌండ్లల్లో లెక్కించనున్నారు. అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి దిగారు.
ఇప్పటి వరకు వెలువడిన తొలి రెండు రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో అధిక్యంలో ఉన్నాడు.