Home / MOVIES / బిగ్‌బాస్‌3 విన్నర్‌ ఎవరో నాకు తెలుసు..యాంకర్ రవి సంచలన వాఖ్యలు

బిగ్‌బాస్‌3 విన్నర్‌ ఎవరో నాకు తెలుసు..యాంకర్ రవి సంచలన వాఖ్యలు

బిగ్‌బాస్‌ 3కి మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్‌ మాత్రమే ఉండగా.. వారి తరపున బయట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తమ అభిమాన కంటెస్టెంట్‌ను గెలిపించాలని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో భాగంగా ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్దమే నడుస్తోంది. మేము గొప్ప అంటే మేమే గొప్ప అంటూ ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. కాగా, ప్రచారంలో సెలబ్రీటీలు సైతం పాలు పంచుకుంటున్నారు. తమకు నచ్చిన కంటెస్టెంట్‌కు సపోర్టు చేయాలంటూ అభిమానులను కోరుతున్నారు. ఇప్పటికే శ్రీముఖికి జబర్దస్త్‌ యాంకర్‌ రష్మీ, రాంప్రసాద్‌ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా యాంకర్‌ రవి కూడా తన బెస్ట్‌ప్రెండ్‌ అలీ రేజాకి మద్దతు తెలిపాడు. తన స్నేహితున్ని గెలిపించాలని కోరుతూ ఫేస్‌బుక్‌ లైవ్‌ నిర్వంచారు.

అయితే ఫేస్‌బుక్‌ లైవ్‌లో రవి పలు ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉన్న అందరూ తనకు ఇష్టమేనని, కానీ తన మద్దతును మాత్రం అలీరెజాకే ఇస్తానని చెప్పాడు. శ్రీముఖినీ కాదని అలీకి ఎందుకు సపోర్ట్‌ చేస్తున్నాడో కూడా వివరించారు. అయితే శ్రీముఖికి ఎందుకు సపోర్ట్‌ చేయడం లేదని అందరూ ట్రోల్‌ చేస్తున్నారు. శ్రీముఖి నా కోయాంకర్‌ మాత్రమే. మా మధ్య మంచి బాండ్‌ ఉంది. తను కూడా గేమ్‌ బాగా ఆడుతోంది. ఈ విషయాన్ని నేను బిగ్‌బాస్‌ షోకి వెళ్లినప్పుడు కూడా చెప్పాను. అయినా ట్రోల్‌ చేస్తున్నారు. అందరికి సపోర్ట్‌ చేయాలని ఉందా? శివజ్యోతికి బిత్తిరి సత్తి సపోర్ట్‌ చేస్తున్నారా? ఒక్కొక్కరికి ఒక్కరు నచ్చుతారు. అలీ నా అన్న లాంటి వాడు అందుకే శ్రీముఖిని కాదని అతనికి సపోర్ట్‌ చేస్తున్నా. మీకు నచ్చిన వారికి సపోర్ట్‌ చేసుకోండి కానీ ట్రోలింగ్‌ చేయకండి ప్లీజ్‌. హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక అందరూ కలిసి ఉంటారు. మీకు గొడవలు ఎందుకు? ఇకనైనా ట్రోలింగ్‌ ఆపండి’ అని రవి కోరారు. అయితే ఫైనల్స్‌కు ఎవరు వెళ్తారని నెటిజన్‌ అడగ్గా.. రాహుల్‌, అలీలు టాప్‌ వన్‌, టూలో ఉంటారని అభిప్రాయపడ్డాడు. బిగ్‌బాస్‌ 3 విన్నర్‌ ఎవరో తనకు తెలుసని, అది మాత్రం ఇప్పుడు చెప్పనని రవి అన్నాడు.

Posted by Anchor Ravi on Tuesday, 22 October 2019

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat