ఆరోగ్యశ్రీ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో ముందడుగు వేశారు. ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదులో, తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై, కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు లో కూడా ఆరోగ్యశ్రీ వర్తింప చేసేలా జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం ఇప్పటికే ఈ పథకం అమలు అవుతోంది. రాష్ట్ర సరిహద్దుల్లోని జిల్లాలైన అనంతపురం, చిత్తూరు నగరాలకు బెంగళూరు, చెన్నై దగ్గరగా ఉంటుంది. వారు రాష్ట్రంలోని ఆస్పత్రుల కంటే ఇతర రాష్ట్రాల ఆస్పత్రికి వెళ్లడం వాళ్లకు సౌకర్యంగా ఉంటుంది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లోని ఆస్పత్రులలో ఆరోగ్య శ్రీ అందించేలా చర్యలు తీసుకోవడం నిజంగా డేరింగ్ డ్యాషింగ్ ఉన్న ముఖ్యమంత్రిగా జగన్ గురించి చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలోని ఏ ఆస్పత్రికి వెళ్లిన ఉచితంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎన్ని లక్షలైనా వైద్యాన్ని అందిస్తున్నారు. ఇదే అవకాశాన్ని ఇతర ఆసుపత్రిలో జగన్ ప్రవేశపెట్టడం పేద ప్రజల పాలిట నిజంగా వరంగా మారింది.
