టాలీవుడ్ టాప్ హీరో నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్. గత 100 రోజులుగా ఈ షో ఎంత హిట్ అయ్యిందో చెప్పనక్కర్లేదు. ఎందుకంటే సామన్య ప్రజలనుండి అందరికి ఈ షో గురించి తెలిసిందే. అయితే బిగ్‌బాస్ షో ముగియడానికి ఇక 2 రోజులు మాత్రమే మిగలడంతో టాప్ 5 ఫైనల్ కంటెస్టెంట్ల తో పాటు పద్నాలుగు వారాల్లో ఎలిమినేట్ అవుతూ వచ్చిన ప్రతీ కంటెస్టెంట్‌ను తిరిగి హౌస్‌లోకి తీసుకురానున్నారు. ఈ మేరకు తాజా ప్రోమో విడుదలైంది. ఇందులో రవి, మహేశ్, హేమ జాఫర్, శివజ్యోతి, హిమజ, అషూ రెడ్డి, రోహిణి, వితిక, పునర్నవి, తమన్నా, శిల్పా చక్రవర్తి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. అయితే బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన నటి హేమ మళ్లీ బిగ్‌బాస్ ఇంట్లో అడుగుపెట్టడం విశేషం. శ్రీముఖి అతివినయం చూపిస్తూ హేమ కాళ్లు పట్టుకోబోయింది. వెంటనే హేమ ‘వద్దమ్మా’ అంటూ ఆమెకో నమస్కారం పెట్టింది.
It's time for a grand reunion of #BiggBossTelugu3
Today at 10 PM on @StarMaa pic.twitter.com/OnXlfhsXwm
— STAR MAA (@StarMaa) November 1, 2019