Home / ANDHRAPRADESH / తూగో జిల్లాలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగలనుందా..?

తూగో జిల్లాలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగలనుందా..?

ఏపీలో టీడీపీ ఘోర పరాజయం పాలుకావడాన్ని చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక పక్క చంద్రబాబు ప్రజలు నన్నే కోరుకుంటున్నారంటూ ఆత్మస్థుతి, పరనిందతో కాలం గడుపుతుంటే.. తోట త్రిమూర్తులు, వల్లభనేని వంశీ వంటి టీడీపీ సీనియర్ నేతలంతా వరుసగా పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఇతర పార్టీలో చేరలేని మరి కొందరు నేతలు మాత్రం పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ..సమయం కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా మాజీ ఎంపీ మురళీమోహన్ కోడలు, రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన రూపాదేవి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

 

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్‌పై లక్ష పై చిలుకు ఓట్లతో రూపాదేవి ఓడిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు మురళీమోహన్ కోడలుగా రాజమండ్రిలో రూపాదేవిదే హవా..మామగారి దత్తత గ్రామాల్లో పలు అభివృద్ధిపనులు చేపట్టారు. షాడో ఎంపీగా పరిధిని మించి రూపాదేవి వ్యవహరించారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. టీడీపీ ఘోర పరాజయం తర్వాత రూపాదేవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా కనిపించడం లేదు. ఆఖరికి అధ్యక్షుడు చంద్రబాబు నిర్వహిస్తున్న పార్టీ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు.

 

దీంతో రూపాదేవి వ్యవహారశైలి ఇప్పుడు టీడీపీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే మాజీ ఎంపీ మురళీమోహన్ క్రియాశీలక రాజకీయాల నుంచి దాదాపుగా తప్పుకున్నారు. ఆయన వారసురాలిగా రూపాదేవి కొనసాగుతుందంటే..ఆమె కూడా పార్టీకి దూరంగా ఉంటూ సొంత వ్యాపకంలొ మునిగిపోయారు. దీంతో రూపాదేవి రాజకీయాలనుంచి తప్పుకుంటుందా..లేదా..వైసీపీలో కాని, బీజేపీలోకాని చేరబోతుందా అన్న చర్చ టీడీపీలో జరుగుతోంది. ఒకవేళ నిజంగానే రూపాదేవి పార్టీని వీడితే..జిల్లా టీడీపీకి ఎదురుదెబ్బ అనే చెప్పాలి…ఇప్పటికే తూగో జిల్లాలో తోట త్రిమూర్తులు తన వేలాది అనుచరులతో వైసీపీలో చేరారు. ఇప్పుడు రూపాదేవి కూడా పార్టీకి గుడ్‌బై చెబితే..జిల్లాలో టీడీపీ పుట్టి మునగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి రూపాదేవి టీడీపీలో కొనసాగుతుందా..లేదా..ఇతర పార్టీల్లో చేరుతుందా అన్న విషయం తేలాల్సి వుంది. మొత్తంగా చంద్రబాబు పిలిచినా ముఖం చాటేస్తున్న మురళీ మోహన్ గారి కోడలు వ్యవహార శైలి..తూగో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat