Home / MOVIES / బిగ్‌బాస్‌..3 టైటిల్ విన్నర్ ఎవరు..ఎవరికి ఓట్లు ఎక్కువ

బిగ్‌బాస్‌..3 టైటిల్ విన్నర్ ఎవరు..ఎవరికి ఓట్లు ఎక్కువ

టాలీవుడ్ రియాలిటీ షో బిగ్‌బాస్‌3 మరో రెండు రోజుల్లో ముగియనుంది. మరొ కోన్ని గంటల్లో ఓటింగ్ కూడ ముగియనుంది. దీంతో తమ ఫేవరెట్‌ కంటెస్టెంట్ల తరపున ప్రచారం చేస్తున్నారు. టైటిల్‌ సమరంలో ఎవరు నెగ్గుతారు ? ఎవరు ఏ స్థానానికి పరిమితమైపోతారు అనేది ప్రజల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఇద్దరి మధ్య ప్రాదాన పోరు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌ వీరిద్దరి మద్య అసలు పోరు ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వీరిద్దరే కనిసిస్తున్నారు. అంతేకాదు ఖచ్చితంగా మా శ్రీముఖి విన్నర్ అని వారు…కాదు మా రాహుల్‌ సిప్లిగంజ్‌ విన్నర్ అని వారి వారి ఫ్యాన్స్ హల్ చల్ చేస్తున్నారు. ఇకపోతే అలీ రెజా, బాబా భాస్కర్‌, వరుణ్‌ సందేశ్‌ టాప్‌ 5లో చోటు దక్కించుకున్నారు. అయితే అలీ రెజా, బాబా మాత్రం ఓటింగ్‌లో చాలా వెనుకబడిపోయారు. దీంతో వీళ్లు టైటిల్‌ రేసు నుంచి తప్పుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇక వరుణ్‌కు అభిమానుల మద్దతు గట్టిగానే ఉన్నప్పటికీ టైటిల్‌ గెలిచేందుకు అవసరమయ్యే ఓట్లు మాత్రం రాబట్టుకోలేకపోతున్నాడు. నేడు కూడా ఓటింగ్‌కు అవకాశం ఉండటంతో అన్ని లెక్కలు మారే అవకాశం ఉంది. మరి టైటిల్‌ను అందుకుని గెలుపును ముద్దాడేది ఆమెనా, అతడా? అన్నది ఆదివారం తేలనుంది.