కాజల్ అగర్వాల్ దశాబ్ధం కాలంగా ఒకపక్క నటనతో. మరోపక్క మత్తెక్కించే అందాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆలరిస్తున్న అందాల రాక్షసి. కుర్ర హీరో సరసన నటించి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల పక్కన నటిస్తూ వరుస విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన హాట్ బ్యూటీ కాజల్ అగర్వాల్.
ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ భారతీయుడు-2 సినిమాలో నటిస్తుంది. దశాబ్ధం కాలంగా నటిస్తున్న కాజల్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ” సినిమాల్లో రాణించాలంటే మత్తెక్కించే అందాలు.. చక్కని నటనే కాదు ఆలోచించగలిగే సత్తా ఉండాలి.
అప్పుడే చక్కని కథలను ఎంచుకోవచ్చు. చక్కని కథలను ఎంచుకున్నప్పుడే సినిమాలు హిట్ అవుతాయి. అప్పుడు మన కెరీర్ సాఫీగా సాగుతుంది. అందుకే హీరోయిన్ గా రాణించాలంటే అందమే కాదు ఆలోచించే సత్తా ఉండాలని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.