టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ తాజాగా మెగాస్టార్ ,సీనియర్ అగ్రహీరో చిరంజీవితో కలిసి నూతన చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రం యొక్క ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. అతి త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ కూడా జరుపుకోనున్నది. అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరు రెండు పాత్రల్లో నటించనున్నారు సమాచారం. ఇందులో ఒక పాత్రకు తగ్గ హీరోయిన్ గా సీనియర్ నటి.. గతంలో చిరుతో ఆడి పాడిన త్రిషను ఎంపిక చేసినట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ చిత్రంలో మరో పాత్రకు సెకండ్ హీరోయిన్ గా శృతి హాసన్ లేదా ఇలియానాలలో ఒకర్ని ఎంపిక చేయాలని చిత్రం యూనిట్ చెప్పిందని సమాచారం. వీరిద్దరిలో ఎవరి డేట్స్ ఖాళీగా ఉంటే వార్ని ఎంపిక చేయాలని కొరటాల శివ తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న వీరిద్దరిలో ఎవర్ని ఎంపిక చేస్తారో చూడాలి మరి.
