ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్ని పాటలో తెలుసా..?
టాలీవుడ్ రేంజ్ ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. తమ నటనతో.. యాక్షన్ తో తెలుగు సినిమా ప్రేక్షకులనే కాకుండా కోలీవుడ్ ప్రేక్షకులను కూడా తమవైపు తిప్పుకున్న స్టార్ హీరోలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. మరోకరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. సీనియర్ సంగీత దర్శకుడు ఎంఎం కిరవాణి స్వరాలు అందిస్తూ .. వీరిద్దర్నీ హీరోలుగా పెట్టి జక్కన్న తీస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ . ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు షూటింగ్ జరుపుకుని అదే ఏడాదిలో విడుదల చేయడానికి జక్కన్న ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో పాటలు ఎన్నో అని ఒక వార్త బయటకు వచ్చింది. ఈ మూవీలో మొత్తం ఎనిమిది పాటలు ఉంటాయని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దేశ భక్తిని పెంపొందించే విధంగా ఇండస్ట్రీ సీనియర్ లిరిక్స్ రైటర్ సుద్ధాల అశోక్ తేజ్ తో మూడు పాటలు జక్కన్న రాయిస్తున్నారని వార్తలు వస్తోన్నాయి.ఆర్ఆర్ఆర్ ఎనౌన్స్ అయిన దగ్గర నుంచి రోజుకో వార్త పుట్టుకొస్తున్న తరుణంలో ఈ వార్తపై ఎంత నిజముందో జక్కన్న తేల్చి చెప్పాలి ఇక.
