వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి పై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా విశాఖ లాంగ్ మార్చ్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైసీపీ సీనియర్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. విజయసాయి రెడ్డిని విమర్శించిన పవన్ కళ్యాణ్ అసలు నీకు ఏ అర్హత ఉంది అని ప్రశ్నిస్తున్నారు. విజయసాయిరెడ్డి నీ నువ్వు కొడతావా దమ్ముంటే చేయి వేసి చూడుఅంటూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ తన స్థాయి ఏంటో తెలుసుకోవాలని.. ఎంతో ఉన్నతమైన చదువులు చదివిన విజయసాయిరెడ్డి ఎంత కనీసం పదవతరగతి కూడా పాస్ కాలేకపోయావ్ నువ్వెంత అని ప్రశ్నించారు. రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా, పాదయాత్ర సమయంలో జగన్ కు అండగా ఉన్న విజయసాయిరెడ్డి బతుకెంత నీ బతుకెంత పవన్ కళ్యాణ్ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.. అసలు విజయ సాయి రెడ్డిని విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్ నీకు ఉందా అని దుమ్మెత్తి పోస్తున్నారు.
