దివంగత రాష్ట్రపతి ఇండియన్ మిస్సైల్ ఏపీజే అబ్దుల్ కలాం ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి శిష్యుడంటా..?. ఇది మేము చెబుతున్న మాట కాదు. స్వయానా సాక్షాత్తు చంద్రబాబే పబ్లిక్ గా అన్నమాటలు. అసలు ముచ్చట ఏమిటంటే రాష్ట్రంలో చిత్తూరు జిల్లా మామండూరు వద్ద ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా పార్టీ అధినేతగా ఆయన హాజరయ్యారు.
ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ” అప్పట్లో నేను ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజన్-2020 తో ముందుకెళ్లాను. ఆ సమయంలోనే నా యొక్క విజన్ గురించి తెలుసుకున్న దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం నా విజన్ కు సంబంధించి పలు అంశాలను నా దగ్గర తెలుసుకుని .. దానికి సంబంధించిన పలు పత్రాలను తీసుకెళ్లి దేశ ఆర్థిక విజన్ పై ఒక పుస్తకాన్ని విడుదల చేశారు “అని ఆయన వ్యాఖ్యానించారు.
దీనిపై నెటిజన్లు స్పందిస్తూ” ఒక్క అబ్దుల్ కలాం గారేంటీ యావత్తు ప్రపంచమే మీ దగ్గర అన్ని విషయాలను నేర్చుకుంటున్నారు. మీరు ప్రపంచ గురువు. అబ్దుల్ కలాం గారితో సహా అందరూ మీకు శిష్యులంటా .. గొప్పలు చెప్పుకోబోయి పప్పులో కాలేశారంటూ” సెటైర్లు వేస్తోన్నారు.