నేచూరల్ హీరో నాని సరనస నటించిన జెంటిల్మెన్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ నివేదా థామస్ . ఈ అందాల భామ ఆ తర్వాత నిన్ను కోరి,జై లవకుశ లాంటి పలు చిత్రాల్లో నటించి టాలీవుడ్ అభిమానులకు దగ్గరైంది. లేటెస్ట్ గా యంగ్ హీరో నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న శ్వాస అనే చిత్రంతో పాటు వి, దర్భార్ చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ భామ . ఈ ముద్దుగుమ్మను ఇన్స్టాగ్రామ్లో చాట్ సెషన్లో కొందరు అసభ్యకర ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు. దీంతో ఆమె సోషల్ మీడియా వేదికగా మండిపడింది. నాతో మాట్లాడడానికి టైం కేటాయించిన వారందరికి థ్యాంక్స్. చాలా మంది ప్రశ్నలకి సమాధానం ఇచ్చాను. కొంత మంది అడిగిన అసభ్యకర ప్రశ్నలు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. మీరు మాట్లాడేది మనిషితోనే అనే విషయం మరచిపోకండి.. అందరికి మర్యాద ఇవ్వండి. త్వరలో మళ్ళీ కలుద్దాం అని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.
