Home / ANDHRAPRADESH / సీఎం జగన్ సలహా

సీఎం జగన్ సలహా

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతను తీర్చడానికి ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించాలి.

ఇందుకు ఈ వారం రోజులు అధికారులు ఎవరూ కూడా సెలవులు తీసుకోవద్దని సలహా ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ఇంకా మాట్లాడుతూ” ఇసుక నిల్వచేసే కేంద్రాలను కూడా ఇంకా పెంచాలి.

ఇసుక తవ్వకాలు,విక్రయాల సిబ్బంది కూడా సెలవులు తీసుకోవద్దని సూచించారు. ఇసుకను ఎవరైన ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ ఈ సందర్భంగా హెచ్చరించారు.