తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంలో బోధన మొదలు పెట్టాలని నిర్ణయించినప్పుడు పవన్ కళ్యాణ్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కచ్చితంగా తెలుగులోనే ఉండాలంటూ గోరంగా పోరాటమే చేయడానికి ప్రయత్నించారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ పవన్ కళ్యాణ్ కు ముగ్గురు భార్యలు నలుగురు పిల్లలు ఉన్నారని వారిని ప్రస్తుతం ఏ మీడియంలో చదువుతున్నారు అంటూ ప్రశ్నించారు. దీనికి ప్రతిస్పందనగా పవన్ మాట్లాడుతూ బాధ్యతాయుతమైన రంగం లో ఉండి కూడా తాను చేసింది చేసుకున్నది ఒకవైపు తప్పు అని తెలుస్తూనే మరోవైపు నుంచి దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కావాలంటే మీరు చేసుకోండి అంటూ బాధ్యత రహితం గా మాట్లాడారు. ఒక పార్టీ అధ్యక్షుడు కొన్ని కోట్ల మందికి రోల్ మోడల్ గా ఉండాల్సిన వ్యక్తి తప్పుని ఒప్పుకోక పోవడంతో పాటు మీరు చేయాలని పిలుపునివ్వడం వారి అభిమానులకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ ని ఏం మాట్లాడుతున్నాడో అతనికి అయినా అర్థం అవుతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు.
