కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు,ఎంపీ శశిథరూర్ కమెడియన్ అవతారమెత్తారు.తాజాగా బాగా ప్రాచుర్యం పొందిన స్టాండప్ కామెడీ కార్యక్రమంలో ఎంపీ శశిథరూర్ భాగస్వామ్యం కానున్నారు. ప్రముఖ ఆన్ లైన్ వాణిజ్య సంస్థ అయిన అమెజాన్ ఫ్రైమ్ సంస్థ రూపొందిస్తున్న వన్ మైక్ స్టాండ్ అనే షో లో శశిథరూర్ కామెడీని పంచనున్నారు. ఇందుకు సంబంధించిన ఒక నిమిషం నిడివి ఉన్న ఒక క్లిప్ ను ఆయన విడుదల చేశారు. ఈ క్లిప్ లో ఆయన మాటలు కడుపుబ్బా నవ్వులను పుట్టించాయి. నిన్న శుక్రవారం నుండి మొదలైన ఈ షోలో ఎంపీ శశిథరూర్‌తోపాటు ప్రముఖ కమెడియన్లు కునాల్ కమ్రా, ఆశీశ్ షాఖ్యా, జకీర్‌ఖాన్, రోషన్ జోషి, సినీ నటులు తాప్సీ, అంగడ్ సింగ్ రన్యాల్ తదితరులున్నారు.
