వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పధకాన్ని మరింత డెవలప్ చేస్తూ ముఖ్యమంత్రి జగన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు.. దీనిద్వారా ఎంతోమంది పేదలతో పాటు మధ్య తరగతి కుటుంబాలకు మేలు జరగనుంది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.60 వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.70 వేల లోపు ఆదాయం గల కుటుంబాలు. ప్రస్తుతం కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉన్న వారిని కూడా అర్హులుగా చేశారు.. గతంలో 2.5 ఎకరాల లోపు మగాణి, 5 ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న వారు అర్హులు. ప్రస్తుతం 12 ఎకరాల లోపు మాగాణి, 35 ఎకరాల లోపు మెట్ట భూమి, మెట్ట, మాగాణి కలిపి 35 ఎకరాల లోపు ఉన్న వారు అర్హులుగా చేశారు. గతంలో కారు లేని వారు మాత్రమే అర్హులు. ప్రస్తుతం కుటుంబానికి ఒక కారు ఉన్న వారు కూడా అర్హులే అంటూ నిబంధన సడలించారు. గతంలో 750 చదరపు అడుగుల లోపు ఇళ్లు కలిగిన వారు మాత్రమే అర్హులు. ప్రస్తుతం 300 చదరపు అడుగుల లోపు ఇళ్లు కలిగిన వారు కూడా అర్హులే. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకంలోకి రాని ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తింపచేశారు.
