టబు ఒకప్పుడు ఒక పక్క అందంతో.. మరోపక్క చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది. దాదాపు రెండున్నర దశాబ్ధాల పాటు తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది ఈ అలనాటి అందాల రాక్షసి.
ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా టాలీవుడ్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న అల వైకుంఠపురములో కీల్ రోల్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ సీనియర్ నటి ఒక ప్రముఖ మీడియాకిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ” నాకు నలబై ఎనిమిదేళ్లు వచ్చిన కానీ నా పెళ్ళి ప్రస్తావన గురించి తెస్తున్నారు.
నాకు పెళ్ళి కాకపోయిన చాలా ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు నాకు నలబై ఎనిమిదేళ్లు. నాకిప్పుడు పెళ్ళి అవసరమా ..?. నాకు నలబై ఎనిమిదేళ్లు వచ్చిన కానీ నా పెళ్ళి గురించే అడుగుతున్నారు అని”ఆమె చెప్పుకొచ్చింది.