శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ తీవ్ర ప్రమాదంలో ఉంది. డ్యాంకు ఏమన్నా సమస్య వస్తే వచ్చే వరద ప్రభావంతో ఏపీ సగం మునుగుతుంది అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ వ్యాఖ్యానించిన సంగతి విదితమే.
అయితే ఈ వార్తలపై రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ” శ్రీశైలం డ్యాం కు ఎలాంటి ముప్పు లేదు. ప్రాజెక్టు భద్రతపై ఇరిగేషన్ శాఖ అధికారుల నుంచి నివేదికను తెప్పించుకున్నాము.
డ్యాం భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ప్రాజెక్టుల నిర్వాహణపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తోన్నాయి అని ఆయన అన్నారు. అనవసర వ్యాఖ్యలు.. విమర్శలు చేసి ప్రజలను గందరగోళానికి గురి చేయద్దు అని సలహా ఇచ్చారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.