విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఇ గతంలో ప్రాతినిధ్యం వహించిన దేవినేని అవినాష్ గత ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి నాని పై తలపడ్డారు ఆయన ఆయన ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి తనకు ఒక నియోజకవర్గం అప్పగిస్తే పార్టీపరంగా బలోపేతం చేసుకునే క్యాడర్ ను బలోపేతం చేసుకొని పెద్ద ఎత్తున పార్టీ కోసం పని చేస్తానని తనకు ఏదో ఒక నియోజకవర్గాన్ని పర్మినెంట్ గా కేటాయించాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అవినాష్ పదేపదే కొద్ది నెలలుగా కోరుతున్నారట. అయితే తే పట్టించుకోకుండా ప్రస్తుతం ఉన్న పదవి లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు పార్టీకి ఎక్కడ అవసరం అయితే అక్కడ పనిచేయాలని ఎన్నికలకు చాలా టైం ఉంది కాబట్టి అప్పుడు చూసుకుందాం అని చెప్పారట. అయితే తే కనీసం అడిగిన పని కూడా చేసి పెట్టకపోవడంతో వైసిపి తీర్థం పుచ్చుకున్నారు అయితే అవినాష్ వైసీపీ లోకి రావడానికి ఇంకా చాలా కారణాలున్నాయి. ప్రస్తుతం మాత్రం అవినాష్ అనుచరులు ఒకటే చెబుతున్నారట చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు అడిగినా మా అన్నకు ఒక నియోజకవర్గాన్ని కేటాయించలేదు అదే సీఎం జగన్ దగ్గర కలిసిన 10 నిమిషాల్లోనే తూర్పు నియోజకవర్గ బాధ్యతలు నువ్వు తీసుకో సిద్ధంగా ఉండు పార్టీ కోసం పని చెయ్యి మున్సిపల్ ఎన్నికల్లో కచ్చితంగా మన పార్టీ గెలవాలి అంటే చెప్పడంతో ఆమె మొత్తం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
