సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అనీల్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టీజర్ నవంబర్ 22న విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ టీజర్ రికార్డులు కూడా సృష్టించింది. మరోపక్క ఇప్పుడు ఇదే రష్మికకు పెద్ద అవమానంగా భావిస్తున్నారు అభిమానులు. టీజర్ మొత్తంలో ఒక్కచోట కూడా హీరోయిన్ కనిపించకపోవడం అభిమానులను కలత చెందేల చేసింది. మరోపక్క ఇందులో మహేష్ ఒక్కడే ఉంటే ఎటువంటి ఇబ్బంది వచ్చేది కాదు. కాని ప్రకాష్ రాజ్, విజయశాంతి ఇలా అందరు కనిపిస్తారు. ఇందులో రష్మిక లేకపోవడంతో ఈ చిత్రంలో తన పాత్ర చిన్నదేమోనని అభిమానులు భావిస్తున్నారు. కాని ఉన్న సమాచారం ప్రకారం చూసుకుంటే ఈ సినిమాలో రష్మిక చిలిపిగా, అల్లరి పిల్లగా ఉంటుందని అంతేకాకుండా హీరోయిన్ కు ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తున్నామని అది డిసెంబర్ నెలలో రిలీజ్ చెయ్యాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.
