దివ్యాంగులగా గుర్తింపు పొందే సదరన్ సర్టిఫికెట్ల జారీకోసం నిబంధనలను సరళతరం చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 52 సెంటర్ల ద్వారా సదరం సర్టిఫికేట్లను దివ్యాంగులకు జారీ చేయటం జరుగుతుంది. వీటిని వారంలో ఒక్కరోజు మాత్రమే జారీ చేయటం జరిగేది.ఇకపై దానిని 52 సెంటర్ల ద్వారా వారానికి రెండు దఫాలుగా జారీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. డిసెంబరు 3న వరల్డ్ డిసెబుల్డ్ డే నాటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.డిసెంబరు 15 నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా వారానికి ఒక రోజు సదరం క్యాంపు సదరం సర్టిఫికేట్స్ కోసం చేసుకున్న దరఖాస్తు పెండింగ్ గతంలో నెల రోజులు ఉండేది. ఆసమయాన్ని 3 నుండి 4 రోజులకు తగ్గించడంతో పాటు అర్హులైన వారందరికీ వీలైనంత వేగంగా సదరం సర్టిఫికెట్ అందించడానికి అవసరమైన చర్యలుతీసుకుంది. జగన్ నిర్ణయం పట్ల దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
