జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసాడు. చంద్రబాబుకి ఎప్పుడూ స్లీపింగ్ పార్టనర్ గా ఉండే పవన్ కళ్యాణ్ ప్రజలు వాళ్ళు ఏం చెప్పిన నమ్మేస్తారు అని అనుకుంటున్నారు. దీంతో ట్విట్టర్ వేదికగా ప్యాకేజీ స్టార్ కి చుక్కలు చూపించాడు.”సీఎం జగన్ గారిపై ప్యాకేజీ స్టార్ విషం కక్కుతున్నాడు. కాల్షీట్లు అయిపోవస్తున్నా ప్రజల నుంచి కనీస స్పందన రావడం లేదు. కుటుంబ పిడికిలి అంటూ కొత్త రాగం అందుకున్నాడు. చంద్రబాబు ఫ్యామిలీలో ముగ్గురు పదవుల్లో ఉన్నారు. మీ అన్నకు ఎంపీ టికెట్ ఇవ్వలేదా? గురివింద గింజలా నీతులు చెప్పొద్దు” అని మండిపడ్డారు.