మహారాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ జరిగిన బలపరీక్షలో ఉద్దవ్ ఠాక్రే నెగ్గారు. సీఎం ఉద్దవ్ ఠాక్రే తన విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సి ఉన్నది. అయితే ప్రతిపక్ష బీజేపీ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. అక్రమంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా సభ నిర్వహిస్తున్నారని మాజీ సీఎం ఫడ్నవీస్ ఆరోపించారు. ప్రోటెం స్పీకర్ నియామకం అనైతికంగా జరిగిందన్నారు. కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ ఇవాళ సభలో విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బీజేపీ వాకౌట్ చేసిన తర్వాత జరిగిన ఓటింగ్‌లో ఉద్దవ్ ప్రభుత్వం నెగ్గింది. ఠాక్రే ప్రభుత్వానికి మద్దతుగా 169 ఓట్లు పోలయ్యాయి.
