వెంకటేష్ దగ్గుబాటి.. సినీ ఇండస్ట్రీలో ప్రతిభావంతులైన నటులలో ఒకరు. వెంకీ తన 30ఏళ్ల సినీ కెరీర్ లో 72చిత్రాల్లో నటించారు. వెంకీ చివరిగా ఎఫ్2 చిత్రంలో కనిపించాడు. ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యింది. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, భారీ హిట్ తో పాటు కలెక్షన్లు కూడా భారీగా వచ్చాయి. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం వెంకీ తన రెమ్యునరేషన్ పెంచేసాడు అని తెలుస్తుంది. మామోలుగా అయితే ఒక సినిమాకు వెంకీ 5కోట్లు తీసుకుంటాడు మరియు తమ బ్యానర్ పై నిర్మించినందుకు ప్రాజెక్ట్ హక్కులను పొందుతాడు. అయితే ఇప్పుడు తన రెమ్యునరేషన్ డబుల్ చేసేసాడు. అంతే 10కోట్లు చేసాడు. వచ్చిన సమాచారం ప్రకారం ప్రస్తుత రోజుల్లో యంగ్ హీరోలు సైతం 10కోట్లు తీసుకుంటున్నారు. దాంతో వెంకీ కూడా అదే బాటలోకి వచ్చేసాడు.