నిధి అగర్వాల్… సవ్యసాచి చిత్రం లో నాగ చైతన్యతో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ, ఆ తరువాత తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్ను చిత్రంలో నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు హిట్ టాక్ అందుకోలేకపోయాయి. అయినప్పటికీ నటన పరంగా ఈ భామకు మంచి పేరు వచ్చింది. ఇక ఆ తరువాత మొన్న పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం బంపర్ హిట్ అయ్యింది. దాంతో ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయింది. అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ హాల్ చల్ చేస్తుంది. తాజాగా రెడ్ డ్రెస్ లో ఉన్న ఒక పిక్ పోస్ట్ చేసింది. దాంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా పూనకం వచ్చినట్టు తయారయ్యారు. హాట్ డ్రెస్ లో హాట్ హాట్ గా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
