వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. సినిమాల్లో రెండేసి, మూడేసి పాత్రలు పోషించినట్టు రాజకీయాల్లో కూడా అదే చేస్తున్నారని ఎద్దేవాచేసారు. తానూ మాట్లాడిన మాటలు ప్రస్తుతం హాల్ చల్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. పెద్ద పెద్ద నాయకులు సైతం ఆయన మాట్లాడిన మాటలపై మండిపడ్డారు. ఇక విజయసాయి రెడ్డి “ప్యాకేజీ స్టార్ విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. సినిమాల్లో డబుల్, ట్రిపుల్ యాక్షన్లు చేసినట్టు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేర్వేరు అవతారాలు ధరిస్తాడు. వింతేమిటంటే ఒక పక్క యజమాని చంద్రబాబును సంతృప్తి పరుస్తూనే, ఇంకో పక్క బీజేపీతో బేరసారాలు సాగిస్తున్నాడు. వాహ్ పావలా…!” అని అన్నారు.
