గత మూడు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితునిగా, సలహాదారునిగా వ్యవహరించిన నారాయణ గత కొంతకాలంగా అనారోగ్య కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. ఈరోజు తెల్లవారుజామున ఆయన మృతి చెందినట్లుసమాచారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ముఖ్య సహాయకుడు గాను సలహదారునిగాను నారాయణ సేవలు అందించారు. దివంగతనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంనుండి వైఎస్ కుటుంబానికి సన్నిహితునిగా మెలిగాడు. నారాయణ మరణవార్త తెలుసుకున్న జగన్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఢిల్లీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని ఢిల్లీ నుంచి నేరుగా కడప ఎయిర్పోర్టుకు అక్కడ నుంచి నారాయణ స్వగ్రామానికి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో నారాయణ స్వగ్రామం అనంతపురం జిల్లా దిగువపల్లె వెళ్లి సంతాపం తెలుపనున్నారు. నారాయణ పార్థివ దేహం చూడదానికి వైఎస్ విజయమ్మ , షర్మిల కూడా రానున్నట్లు తెలుస్తుంది. తిరిగి సాయంత్రం తాడేపల్లి లో సీఎం క్యాంపు కార్యాలయం కు చేరుకోనున్నారు.
