టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి ,టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు.ఈ మూవీలో రష్మిక మందాన హీరోయిన్ గా.. సీనియర్ నటులు విజయశాంతి,రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా అనిల్ సుంకర,దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే జనవరి పదకొండు తారీఖున విడుదల చేయడానికి చిత్రం యూనిట్ సన్నద్ధమవుతుంది. ఈ రోజు సోమవారం మరో పాటను ‘హి ఈజ్ సో క్యూట్..హి ఈజ్ సో స్వీట్..హి ఈజ్ సో హ్యాండ్సమ్’ అని శ్రీమణి రాసి.. మధుప్రియ పాడిన పాటను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ దుమ్ములేపుతుంది. మీరు ఒక లుక్ వేయండి.
