కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన నేతలపై జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” కాషాయపు వస్త్రాలు ధరించే కొందరు భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు,కార్యకర్తలు పెళ్లిళ్లు చేసుకోరు.
కానీ మహిళలపై అత్యాచారాలు చేస్తారంటూ “ఘాటుగా వ్యాఖ్యానించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో బీజేపీ విఫలమైంది. అత్యాచార నిందితులకు బీజేపీ రక్షణ కల్పిస్తుంది అని ఆయన ఆరోపించారు.
అయితే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముక్తిమోర్చా కాంగ్రెస్,ఆర్జేడీ కూటమి తరపున సీఎం అభ్యర్థిగా హేమంత్ సోరెన్ ఉన్నారు.