ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సంతకం చేశారు.
ఆర్టీసీలో పని చేసే ప్రతీ ఉద్యోగికీ పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం వర్తిస్తుంది. ఇటీవల ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో పదవీ విరమణ వయస్సును పెంచుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.