దివంగత భారత మాజీ ప్రధాన మంత్రి ఏబీ వాజ్ పాయికి అరుదైన గౌరవం దక్కింది. హిమాచల్ ప్రదేశ్ లోని లెహ్ -మనాలి మధ్య నిర్మించిన రోహ్ తంగ్ సొరంగ మార్గానికి దివంగత మాజీ ప్రధాని వాజ్ పాయి పేరు పెట్టనున్నారు.
నేడు వాజ్ పాయి 95వ జన్మదిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సారధ్యంలోని కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు ఆమోదం తెలిపింది.
వాజ్ పాయి హాయాంలో 2000సంవత్సరంలో జూన్ 3తేదిన ఈ సొరంగం నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 2002వ సంవత్సరంలో మే26న పునాది రాయి పడింది.