నిధి అగర్వాల్… సవ్యసాచి చిత్రం లో నాగ చైతన్యతో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ, ఆ తరువాత తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్ను చిత్రంలో నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు హిట్ టాక్ అందుకోలేకపోయాయి. అయినప్పటికీ నటన పరంగా ఈ భామకు మంచి పేరు వచ్చింది. ఇక ఆ తరువాత మొన్న పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం బంపర్ హిట్ అయ్యింది. దాంతో ముద్దుగుమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది. మరోపక్క ఈమెకు సినిమాలకన్నా సోషల్ మీడియాలోనే ఫుల్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. అయితే ఈ ఫాలోయింగ్ ఎప్పటివరకు ఉంటుందో అది ఆమె నటించే సినిమాలు బట్టి ఉంటుందని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఫామ్ ను కొనసాగిస్తే పర్లేదు లేదంటే కష్టమే అని చెప్పాలి.
