Home / SLIDER / ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి స్వీకారం చుట్టి హారిత విప్లవానికి నాందిపలికిన సంగతి విదితమే. తాజాగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తన అధికారక ట్విట్టర్ ఖాతా నుండి మరో పిలుపునిచ్చాడు.

ఇందులో భాగంగా నాటిన విత్తనం మొలకెత్తడంలో ఎన్నో సవాళ్లు.. అది మొక్కగా ప్రాణం పోసుకోవడంలో మరెన్నో అవాంతరాలు ఎదురవుతాయి. వాటిని పరిగణలోకి తీసుకుంటే మనం కొన్ని మొక్కలను నాటడం పెద్ద కష్టమైన పనేమి కాదు. ప్రకృతి పట్ల ,మొక్కల పట్ల దయను చూపండి.

మొక్కలను నాటండి.ఈ భూమిపై మొక్కలు మాత్రమే స్వఛ్చమైన ఆనందాన్ని ఇవ్వగలవని”ఎంపీ సంతోష్ కుమార్ తన ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఈ ట్వీట్ తో పాటుగా విత్తనం మొలకెత్తడంలో ఉండే అవాంతరాలను కళ్లకు కట్టేలా అర్ధమయ్యే విధంగా ఉండే వీడియోను కూడా సంతోష్ పోస్టు చేశాడు.