రెజీనా ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీబిజీ అయిన బక్కపలచు భామ. ప్రస్తుతం ఆమె ఇటు తెలుగు అటు తమిళ భాషాల్లో వరుస సినిమాలతో తన ఉనికిని చాటుకుంటుంది ఈ ముద్దు గుమ్మ. తాజాగా ఈ బక్కపలచు అందాల రాక్షసి యాపిల్ ట్రీ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కుతున్న ఒక చిత్రంలో నటిస్తుంది.
ఇటీవల విడుదలైన నిను వీడని నీడను నేనే ఫేం దర్శకుడు కార్తిక్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. నిర్మాతగా రాజశేఖర్ వర్మ వ్యవహరిస్తున్న ఈ మూవీ ఈ నెల పదమూడో తారీఖు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజశేఖర్ మాట్లాడుతూ” ఈ మూవీ యాక్షన్, అడ్వెంచర్, వినోదం అంశాలతో రూపొందుతున్న మిస్టరీ థ్రిల్లర్ మూవీ.
దీంట్లో సినిమాలో ఆర్కియాలజిస్ట్‌గా రెజీనా కనపించనున్నారు. కథానుగుణంగా డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో ఆమె నటించనున్నారు. త్వరలోనే ఫస్ట్‌లుక్ విడుదల చేయడంతో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని వెల్లడిస్తామని”తెలిపారు.