తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు గురువారం ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,మున్సిపల్ ఎన్నికల ఇంచార్జులతో భేటీ కానున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో సమావేశం కానున్నారు.
ఈరోజు ఉదయం పది గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమవ్వనున్నారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,నియోజకవర్గ ఇంచార్జులతో పాటుగా మున్సిపల్ ఎన్నికల బాధ్యులు కూడా హజరవుతారు.
మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగనున్న అభ్యర్థులకు ఏ ఫారాలు..బీ ఫారాలు అందజేయనున్నారు.రెబల్స్ ఉన్నచోట వారిని ఎలా బుజ్జగించాలి.. ఎలా నచ్చజెప్పాలి. ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి ఇలా తదితర అంశాల గురించి పార్టీ అధినేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.